హైదరాబాద్: మహిళలను చులకన చేస్తూ, వారి మనోభావాలను దెబ్బతీసేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని, ఆయన్ని ఎమ్మెల్యేగా డిస్ క్వాలిఫై చేయాలని మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాతతో పాటు పలువురు మహిళా కాంగ్రెస్ నాయకులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‍ను కోరారు. ఇవాళ మినిస్టర్ క్వార్టర్స్ లో స్పీకర్‌ను కలిసి.. వారు వినతి పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి మహిళలపై చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలి. మహిళల మనోభావాలు దెబ్బతీసేలా కౌశిక్ రెడ్డి మాట్లాడిండు. ఈ వ్యాఖ్యలను స్పీకర్ తీవ్రంగా పరిగణించి, చర్యలు తీసుకోవాలి. మహిళలపై కౌశిక్ రెడ్డి సొంత మాటల లేదా.. బీఆర్ఎస్ పార్టీ విధానమా అనేది స్పష్టం చేయాలి. కేటీఆర్ మాట్లాడలేక కౌశిక్‌రెడ్డితో మాట్లాడిస్తున్నారు. మహిళలను గౌరవించని కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.