
- హనుమకొండ సిటీ, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని గురువారం హనుమకొండ పోలీస్‌స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్, బిల్డర్స్ నుంచి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపించాడని నిరాధార ఆరోపణలు చేశాడన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కంప్లయింట్ఇచ్చిన వారిలో టీపీసీసీ మెంబర్స్ బత్తిని శ్రీనివాసరావు, కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, జక్కు రవిందర్ యాదవ్, పోతుల శ్రీమాన్, విజయశ్రీ ఉన్నారు.