బీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు సృష్టిస్తున్నరు: కాంగ్రెస్

ఓటర్ లిస్ట్ సర్వే పేరుతో ఓ ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకులు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్, మజ్లీస్ నేతలు నిరసన తెలిపిన ఘటన నిజామాబాద్ లో కలకలం సృష్టించింది. 

వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన 30 మంది నిర్వాహకులు జిల్లాలోని ఆర్మూర్, మాక్లూర్ ప్రాంత ప్రజల ఓటర్ల లిస్ట్ సంపాదించారు. అనంతరం లిస్ట్ లో ఫొటోలు మార్చడానికి ప్రయత్నించారు. 

అదే టైంలో కాంగ్రెస్, మజ్లీస్ నేతలు అక్కడికి వచ్చి నిర్వాహకులను పట్టుకున్నారు. వారి నుంచి లిస్ట్ స్వాధీనం చేసుకున్నారు. 6 నెలలుగా ఓటర్ లిస్ట్ మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. 

ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికార బీఆర్ఎస్ నేతలే దొంగ ఓట్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.