యాదగిరిగుట్ట, వెలుగు: కాంగ్రెస్ ప్రకటిస్తున్న డిక్లరేషన్లు రాష్ట్ర ప్రజల సంక్షేమానికి దిక్సూచీ వంటివని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. డిక్లరేషన్లలో పొందుపర్చిన అంశాలన్నింటినీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం గందమల్ల గ్రామానికి చెందిన 100 మంది బీఆర్ఎస్ నాయకులు ఆదివారం యాదగిరిగుట్టలో బీర్ల అయిలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
వారందరికీ కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కేసీఆర్కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదగిరి గౌడ్, యాదగిరిగుట్ట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు శంకర్ నాయక్, తుర్కపల్లి మండల ప్రధాన కార్యదర్శి చాడ భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ మోహన్ బాబు నాయక్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ నాయక్ పాల్గొన్నారు.