రెవెన్యూ డివిజన్​ ఎందుకు తీసుకురాలేదు?

రెవెన్యూ డివిజన్​ ఎందుకు తీసుకురాలేదు?
  • బీఆర్​ఎస్​ నేతలను నిలదీసిన కాంగ్రెస్ ​నాయకులు

చేర్యాల, వెలుగు : పదేళ్ల బీఆర్ఎస్​పాలనలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్​రెడ్డి రెవెన్యూ డివిజన్​ఎందుకు తీసుకురాలేదని కాంగ్రెస్​నేతలు నిలదీశారు. శుక్రవారం కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆగం రెడ్డి, చేర్యాల మండల అధ్యక్షుడు కొమ్ము రవి, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. చేర్యాల ప్రాంతానికి మోసం చేసిన బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్​నేతలను విమర్శించే హక్కు లేదన్నారు.

 బీఆర్ఎస్​హయాంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కొమ్మూరి ప్రతాప్​రెడ్డి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి జేఏసీగా ఏర్పడి రెవెన్యూ డివిజన్​కోసం అనేక దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు చేసిందన్నారు. దొంగ ఓట్లతో ఎమ్మెల్యేగా  గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పదేండ్లు అధికారంలో ఉండి డివిజన్ తీసుకురాలేక నేడు ప్రజల ఆదరణ పొందడానికి కొత్తగా జేఏసీ ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చంద్రయ్య, లక్ష్మి నారాయణ, చిరంజీవులు, లింగం, యాదగిరి, దుర్గయ్య, రాములు గౌడ్,  ప్రసాద్ గౌడ్, మల్లేశం, రమేశ్, శంకర్, రాకేశ్, సంతోష్ రెడ్డి , శ్రీనివాస్, తాహెర్ ఎండీ జౌర్, రమేశ్ పాల్గొన్నారు.