కాకా ఫౌండేషన్ ద్వారా తోపుడు బండ్ల పంపిణీ

ధర్మారం, వెలుగు:  ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామంలోని సాగర్ల లచ్చవ్వ, కట్ట లచ్చవ్వకుకాకా ఫౌండేషన్  ఆధ్వర్యంలో  తోపుడు బండ్లను కాంగ్రెస్​ నాయకులు బుధవారం పంపిణీ చేశారు.  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి  కాకా ఫౌండేషన్​ తరఫున అందించారని నాయకులు తెలిపారు.   ఈ సందర్భంగా వారు ఫౌండేషన్ చైర్మన్ వివేక్ వెంకటస్వామికి,  ధర్మారం కోఆర్డినేటర్ కాడే సూర్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు పొన్నం కృష్ణ,ఉప సర్పంచ్ రామడుగు గంగిరెడ్డి, బోనగిరి శ్రీనివాస్, రేండ్ల నరేశ్,ఉయ్యాల మల్లేశం, బల్ల రమేశ్, బోనగిరి అజయ్,అనపురం సందీప్, చెపురి లచ్చయ్య, దాసరి ఓదేశ్,రేండ్ల కోటయ్య, ఐలవేని శ్రీనివాస్,ఉట్ల తిరుపతి, ముల్కల పోచయ్య,  కాంగ్రెస్ కార్యకర్తలు, జంగిలి రాజయ్య  పాల్గొన్నారు.