మైక్ కోసం భట్టి ఎదుట కొట్టుకున్న లీడర్లు

దేవరకొండ( కొండమల్లేపల్లి), వెలుగు:  నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపడుతున్న పీపుల్స్ మార్చ్ యాత్రలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల ఆధిపత్యం కోసం తరచూ గొడవలకు దిగుతున్నారు. ఈ పరిస్థితితో పార్టీ పరువు బజారున పడుతోందని పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కొండమల్లేపల్లిలో జరిగిన యాత్రలో ప్రచార రథంపై  భట్టి విక్రమార్క ఎదుట కాంగ్రెస్ టికెట్​ ఆశిస్తున్న బాలు నాయక్ , నేనావత్ కిషన్ నాయకులు గొడవపడ్డారు. బాలు నాయక్ మైక్ తీసుకుని మాట్లాడుతుండగా కిషన్ నాయక్ ఆయన మైకును గుంజుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వావాదం జరిగింది. దీంతో భట్టి తీవ్ర అసహనానికి గురై ఇరువురిని మందలించారు.