ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవ రెడ్డి భవన్లో మానవతారాయ్, మట్టా దయానంద్ వర్గీయులు కొట్టుకున్నారు. మాజీ ఓయూ జేఏసీ నాయకుడు మానవతా రాయ్ సత్తుపల్లి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మట్టా దయానంద్‌కు, ఆయనకు పడటం లేదు. బుధవారం పార్టీ ఆఫీస్‌లో విజయభేరి సన్నాహక సమావేశం నిర్వహించారు.
ALSO READ: సర్పంచ్ వేధింపులతో మహిళ మృతి
దీనికి ఏఐసీసీ అబ్జర్వర్ మహ్మద్ ఆరీఫ్ నసీం, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి వచ్చారు. సభకు ఎవరు ఎంత మందిని తరలిస్తారో చెప్పాలని అడగా ఇరువర్గాల నేతలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. మాటామాటా పెరిగి కొట్టుకునేదాకా వెళ్లింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసు రుకోవడంతో ఆరీఫ్, రేణుకా చౌదరి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. తర్వాత వారిద్దరూ వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గం నుంచి 10వేల మందిని విజయభేరి సభకు తరలిస్తామన్నారు.