ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి అసమర్థతతోనే.. ఇండ్ల రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కాలె

ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి అసమర్థతతోనే..  ఇండ్ల రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కాలె

ఎల్బీనగర్, వెలుగు : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అసమర్థత వల్లే ఇండ్ల రిజిస్ట్రేషన్ల సమస్య ఇంకా పరిష్కారం కాలేదని ఎల్బీనగర్​నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు విమర్శించారు. జీఓ నం.118పై మధుయాష్కిగౌడ్​పై సుధీర్​రెడ్డి చేసిన కామెంట్లకు బుధవారం స్పందించారు. జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు వజీర్ ప్రకాష్ గౌడ్, సామ రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

విలువలతో కూడిన రాజకీయం చేసే మధుయాష్కి గౌడ్ పై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చిల్లర కామెంట్లు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అని విమర్శించారు. 2005లో హుడా చైర్మన్​గా, ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన సుధీర్ రెడ్డి ఆస్తులెన్నో లెక్కతీద్దామా అని ప్రశ్నించారు. తప్పుల తడకతో జీఓ నం.118ను తీసుకొచ్చి కాలనీల ప్రజలను మోసం చేసింది నిజం కాదా అని నిలదీశారు.