వరద పరిస్థితిని సమీక్షించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలు

రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రహదారులు అస్తవ్యస్తంగా మారి, జనజీవనానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. అందుకు గాను జిల్లాల వారిగా పరిస్థితిని సమీక్షించేందుకు టీమ్ లను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మహేశ్వర్ రెడ్డి, సి. రామచంద్రా రెడ్డి, పరమేశ్వర రావు, అన్వేష్ రెడ్డి, సాజిద్ ఖాన్, కె. సురేఖ, రామారావు పటేల్ పవార్, విశ్వప్రసాద్ రావులు వర్షం కారణంగా అత్యంత ప్రభావితమైన ఆదిలాబాద్ జిల్లాను పర్యటించేందుకు సమాయత్తం అవుతున్నారు.

సుదర్శన్ రెడ్డి, కోదండ రెడ్డి, మధుయాష్కి గౌడ్, మహేశ్ కుమార్ గౌడ్, మహమూద్ అలీ షబ్బీర్, గంగారాం, అనిల్ కుమార్, మోహన్ రెడ్డి, కైలాష్ శ్రీనివాస రావులు నిజామాబాద్ జిల్లాలో పరిస్థితిని సమీక్షించేందుకు టీమ్ గా ఏర్పాటు చేశారు. వీరితో పాటు శ్రీధర్ రాజు, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్, కొమురయ్య, సత్యనారాయణలతో మరొక టీమ్ ఏర్పాటు చేశారు. వీరు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు.