గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని పట్టణానికి చెందిన కాంగ్రెస్ లీడర్లకు ప్రాణాపాయం తప్పింది. కాంగ్రెస్ రామగుండం కార్పొరేషన్ ఏరియా ప్రెసిడెంట్ బొంతల రాజేశ్, గోదావరిఖని పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్, లీడర్లు నాయిని ఓదెలు యాదవ్, తిరుపతి ఆదివారం హైదరాబాద్కు వెళుతుండగా శామీర్పేట దాటిన తర్వాత వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
ఎదురుగా మరో వాహనం అడ్డుగా రావడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో రెండు ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న లీడర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారికి ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.