ఎంపీ బండి సంజయ్ పై పోలీసులకు ఫిర్యాదు

ఎల్కతుర్తి, వెలుగు : మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అవమానించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సంజయ్ పై చర్యలు తీసుకోవాలని   స్థానిక పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. అంతకు ముందు యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ నాయకులు 'చలో బొమ్మనపల్లి' కి పిలుపునిచ్చారు. బొమ్మనపల్లిలో బండి యాత్రను అడ్డుకున్నారు. బండికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.‌‌‌‌‌‌‌‌ వారిని పోలీసులు అరెస్ట్ చేసి సైదాపూర్ పోలీస్ స్టేషన్ తరలించారు.

పీసీసీ మెంబర్ బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, మాజీ అధ్యక్షుడు సుకినె సంతాజీ, సీనియర్ నాయకులు గొడిశాల యాదగిరి గౌడ్, సొసైటీ మాజీ చైర్మన్ గోలి రాజేశ్వర్ రావు, జీల్గుల సర్పంచ్ చల్లా మల్లారెడ్డి ఉన్నారు. భీమదేవరపల్లి,వెలుగు:కోహెడ మండల కేంద్రంలో కొనసాగిన ప్రజాహిత పాదయాత్రలో బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఆయన  తల్లి గురించి వ్యక్తిగత విమర్శలు చేశాడని ఆరోపిస్తూ ..

భీమదేవరపల్లి మండల వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.   మల్లారం గ్రామానికి ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర చేరుకోనున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  కాంగ్రెస్ నాయకులు కొలుగురి రాజు, ఆదరి రవీందర్ మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు సహజమే కానీ వ్యక్తిగతంగా కుటుంబం పట్ల విమర్శ చేయకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేదని ప్రశ్నించారు.