ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ విడిచిపోరనే అనుకుంటున్నామని తెలిపారు కాంగ్రెస్ నేతలు. ఇవాళ(గురువారం) ఆయన మీడియాతో మాట్లాడారు సీఏల్పీ నేత భట్టి విక్రమార్క,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. జగ్గారెడ్డికి కొన్ని ఇబ్బందులున్నాయని,తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. జగ్గారెడ్డి రాజీనామా చేయకుండా సముదాయించామని, ఆయన లేవనెత్తిన అంశాలపై అధిష్టానంతో మాట్లాడుతామని తెలిపారు.జగ్గారెడ్డి కార్యకర్తల సమావేశానికి రాజీనామాకు సంబందం లేదని..ఆయన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గారనే అనుకుంటుంన్నాం అని అన్నారు భట్టి.
జగ్గారెడ్డి పార్టీ వీడడనే అనుకుంటున్నా అని అన్నారు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.నేను పార్టీ వీడతానని అన్నాను .. వెళ్ళానా .. నాలాగే జగ్గారెడ్డి కూడా అని చెప్పారు.సీఎల్పీ లో ఉన్నాము రమ్మంటే వచ్చానన్న రాజగోపాల్ రెడ్డి..ఏదన్నా ఇంపార్టెంట్ అనుకుంటే నే వస్తున్నా .. లేకుంటే ఫామ్ హౌస్ లో ఉంటున్నానని తెలిపారు.
మరిన్ని వార్తల కోసం..