కామారెడ్డి, వెలుగు: ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన మాజీ మంత్రి షబ్బీర్‌అలీని సోమవారం కామారెడ్డికి చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సన్మానించారు. హైదరాబాద్‌లోని షబ్బీర్‌అలీ ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, లీగల్‌సెల్ జిల్లా చైర్మన్ దేవరాజు గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ పండ్ల రాజు, లీడర్లు గోనె శ్రీనివాస్, కారంగుల అశోక్‌రెడ్డి, పంపరి లక్ష్మణ్, శ్రీనివాస్, శ్యాంగౌడ్, పంతులు శీను, శ్రీధర్రావుపాల్గొన్నారు.
భిక్కనూరు: ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులైన మాజీ మంత్రి షబ్బీర్‌అలీని భిక్కనూరు మండల కాంగ్రెస్ లీడర్లు సోమవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీపీ గాల్‌రెడ్డి, మండలాధ్యక్షుడు భీమ్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్‌రెడ్డి, కుంట లింగారెడ్డి, మాజీ ఎంపీపీ బాల్యల రేఖ, సుదర్శన్ పాల్గొన్నారు.