
నెల్లికుదురు( ఇనుగుర్తి)/ రేగొండ, వెలుగు: జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి యాత్ర ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకుందామని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన డీసీసీ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి కలిసి హాజరయ్యారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం జగ్గయ్యపేటలో నిర్వహించిన యాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యనారాయణరావు ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డితో కలిసి పాల్గొని రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజలకు అందించేందుకు కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. అంతకుమందు దమ్మన్నపేటలో పెద్దమ్మతల్లి ఆలయాన్ని ఆయన ప్రారంభించారు.