ఎంపీ సంతోష్ కుమార్ కనిపించడం లేదని ఫిర్యాదు

ఎంపీ సంతోష్ కుమార్ కనిపించడం లేదని ఫిర్యాదు

బోయినిపల్లి, వెలుగు: టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కనిపించడం లేదంటూ కాంగ్రెస్ ​నాయకులు బోయిన్ పల్లి పోలీస్ ​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పీసీసీ మెంబర్, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్ మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న వెన్నమనేని శ్రీనివాస్ రావు తో ఎంపీకి సంబంధాలున్నట్లు మీడియా ద్వారా తమకు తెలిసిందని అన్నారు. ఈ క్రమంలో ఎంపీ కనిపించకుండా పోయారని వాపోయారు. ఎంపీ ఆచూకీ కనిపెట్టాలని కాంగ్రెస్​ నాయకులు పోలీసులను కోరారు.