కాంగ్రెస్​ శ్రేణుల సంబురాలు

పెద్దపల్లి, వెలుగు: గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పెద్దపల్లి కాంగ్రెస్​ నాయకులు అన్నారు. వంశీకృష్ణకు కాంగ్రెస్​పెద్దపల్లి పార్లమెంటు టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటాయించిన క్రమంలో శుక్రవారం పెద్దపల్లి కాంగ్రెస్​ నాయకులు హైదరాబాద్​లో వంశీకృష్ణను, ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామిని కలిసి శాలువాలతో సన్మానం చేశారు. వచ్చే ఎన్నికల్లో వంశీని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు.  కార్యక్రమంలో ఎన్​ఎస్​యుఐ నాయకుడు బండారి సునీల్​గౌడ్​, బాలసాని సతీశ్ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అడ్డగుంట​శ్రీనివాస్​, పడాల ప్రసాద్​గౌడ్, సయ్యద్​ సలాజ్​ తదితరులు పాల్గొన్నారు. 

పెద్దపల్లి: కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెద్దపల్లి పార్లమెంటు టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి మనుమడు, చెన్నూర్​ ఎమ్మెల్యే గడ్డం వివేక్​ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం కాంగ్రెస్​ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. పెద్దపల్లి పట్టణంతో పాటు జూలపల్లి, ధర్మారం, మండల కేంద్రాల్లో స్వీట్లు పంచుకున్నారు.  కాడే సూర్యనారాయణ, పాటకుల మహేశ్​, గాగిరెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

సుల్తానాబాద్: సుల్తానాబాద్ లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకులు శుక్రవారం రాత్రి సంబరాలు నిర్వహించారు.  స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సీట్లు పంపిణీ చేశారు.  మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, వైస్ చైర్ పర్సన్ బిరుదు సమతా కృష్ణ, పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్య గౌడ్, లీడర్లు నీరటి శంకర్, గణేష్, రఫిక్, తదితరులు పాల్గొన్నారు. 
గోదావరిఖని:  గడ్డం వంశీ కృష్ణకు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించినందున పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్టు కాంగ్రెస్​ పార్టీ జిల్లా జనరల్​ సెక్రెటరీ పాకాల గోవర్ధన్​రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 
 

గోదావరిఖని: అంతర్గాం మండలం బస్టాండ్​, అంబేడ్కర్​ సర్కిల్​ వద్ద ప్రయాణికులకు, ఆటో యూనియన్ నాయకులకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం మధు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి స్వీట్స్ పంపిణీ చేశారు.  
 

పెద్దపల్లి: పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావును పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్​  ఎమ్మెల్యే డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.