చౌటుప్పల్, వెలుగు: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కాలని చౌటుప్పల్ మున్సిపల్ చెర్మన్ వెన్రెడ్డి రాజు, సంధ్య దంపతులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్నాయకులు సోమవారం స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
రాజగోపాల్ గెలిస్తే 108 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్న రాజు, అందరితో కలిసి మొక్కు తీర్చుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి రాజగోపాల్ కు మంత్రి పదవి దక్కేలా చూడాలని ప్రార్థించినట్లు చెప్పారు. కౌన్సిలర్లు కోయడ సైదులుగౌడ్, కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, కామిశెట్టి శైలజ భాస్కర్, బొబ్బిళ్ల మురళి, మోగదాల రమేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.