కొండగట్టు, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోపాటు చొప్పదండి ఎమ్మెల్యేగా మేడిపల్లి సత్యం విజయం సాధించిన సందర్భంగా కొడిమ్యాల మండల కాంగ్రెస్ నాయకులు మంగళవారం కొండగట్టు అంజన్న సన్నిధికి పాదయాత్ర చేపట్టారు. అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లీడర్లు రాజేశ్వరి, జీవన్ రెడ్డి, రాజేందర్, నిఖిల్, ముత్యం శంకర్ నర్సయ్య, సాయి, కల్యాణ్ పాల్గొన్నారు.
యువకుడి పాదయాత్ర
వేములవాడ, వెలుగు : వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గెలిచిన సందర్భంగా పట్టణానికి చెందిన యువకుడు తౌటు సాయి అలియాస్ బిత్తిరి సత్తి వేములవాడ రాజన్న ఆలయం నుంచి కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరాడు. ఈ సందర్భంగా యువకుడికి మంగళవారం కాంగ్రెస్ లీడర్లు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేశ్, జిల్లా మహిళా కార్యదర్శి పాత సత్యలక్ష్మి, దూలం భూమేశ్గౌడ్, సతీశ్, తిరుపతి, శ్రీకాంత్ పాల్గొన్నారు.