నెట్వర్క్ వెలుగు : మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతికి ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. శుక్రవారం రాత్రి కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. మందమర్రిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు మన్మోహన్సింగ్ ఫోటో వద్ద కొవ్వొత్తులు వెలిగించారు.
మన్మోహన్సింగ్ దేశానికి అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ లీడర్లు రాయబారపు కిరణ్, మాయ తిరుపతి, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ----