సీఎం, మంత్రుల ఫోటోలకు క్షీరాభిషేకం

సీఎం, మంత్రుల ఫోటోలకు క్షీరాభిషేకం

కోరుట్ల, వెలుగు: కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో కోరుట్లలో గురువారం సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మంత్రుల ఫొటోలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కులగణన విజయవంతగా పూర్తిచేసి ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వానికి, హామీ నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

​బీసీ కులగణన చారిత్రాతకమైన నిర్ణయమన్నారు. కాంగ్రెస్​ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్, కాంగ్రెస్​పట్టణ, మండల, బ్లాక్​ అధ్యక్షులు తిరుమల గంగాధర్, కొంతరాజం, సత్యనారాయణ, లింబాద్రి, సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శంకర్ గౌడ్, ప్రభాకర్, నాగభూషణం, భూమారెడ్డి పాల్గొన్నారు.