
హుజూరాబాద్, వెలుగు: దళిత బంధు రెండో విడత నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీకావడంతో హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ లీడర్లు సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద మిఠాయిలు పంపిణీ చేసుకొని సంబురాలు చేసుకున్నారు. నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.