మల్కపేట రిజర్వాయర్‌‌‌‌ నుంచి సాగునీరు విడుదల

 మల్కపేట రిజర్వాయర్‌‌‌‌ నుంచి సాగునీరు విడుదల

ఎల్లారెడ్డిపేట, వెలుగు: మల్కపేట రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు సాగునీరు విడుదల కావడంతో ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌‌పూర్ శివారులోని కెనాల్‌‌లో శుక్రవారం కాంగ్రెస్‌‌ లీడర్లు పూజలు చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌‌చార్జి కేకే మహేందర్‌‌‌‌రెడ్డి కృషితో సాగునీరు విడుదలైందన్నారు. 9వ ప్యాకేజీ కెనాల్ ద్యారా సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాబేరాబేగం గౌస్, వైస్ చైర్మన్ రాంరెడ్డి, డైరెక్టర్లు రాజేందర్, మెండే శ్రీను, లక్ష్మారెడ్డి, లీడర్లు చెన్నిబాబు, బాల్ రెడ్డి, రొడ్డ రాంచంద్రం పాల్గొన్నారు.

మల్కపేట కాళేశ్వరంలో భాగమే

కేసీఆర్‌‌‌‌ నాయకత్వంలోని గత ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా మల్కపేట రిజర్వాయర్‌‌‌‌కు రూపకల్పన చేసిందని, కానీ కాంగ్రెస్‌‌ లీడర్లు నీటి విడుదల పేరిట ఎందుకు హడావుడి చేస్తున్నారని బీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్లు ప్రశ్నించారు. 

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పార్టీ ఆఫీస్ లో మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి ఆధ్వర్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో రూ.550 కోట్లతో మల్కపేట రిజర్వాయర్‌‌‌‌ నిర్మించినట్లు చెప్పారు. సమావేశంలో లీడర్లు అందే సుభాష్, నర్సింహారెడ్డి, బాల్ రెడ్డి, సందీప్, రాజం, నర్సింహులు పాల్గొన్నారు.