
పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో విజయం సాధించాలని జూన్ 03 వ తేదీ సోమవారం మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులు హేమంత్ రెడ్డి దంపతులు పూజలు నిర్వహించారు. చెన్నూర్ పట్టణంలోని శివాలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో గడ్డం వంశీకృష్ణ 2 లక్షల భారీ మెజార్టీతో గెలువబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, వివేక్ వెంకటస్వామి ఫాలోవర్స్ తదితరులు పాల్గొన్నారు. కాగా పెద్దపల్లి లోక్ సభ బరిలో బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ బరిలో నిలిచారు.