కోల్బెల్ట్, వెలుగు : చెన్నూరు ఎమ్మెల్యేగా గడ్డం వివేక్ వెంకటస్వామి గెలుపొందడంతో కాంగ్రెస్ లీడర్లు మంగళవారం కొండగట్టులో ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్, యాదవ సంఘం జిల్లా ప్రెసిడెంట్ బండి సదానందం ఆధ్వర్యంలో లీడర్లు 101 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో వివేక్ వెంకటస్వామికి కీలకమైన పదవి రావాలని కోరుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో లీడర్లు సెగ్యం రవికుమార్, వీరేశం, కోట రాజయ్య, సురేశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
భీమారంలో..
జైపూర్(భీమారం)వెలుగు : గడ్డం వివేక్ వెంకట స్వామి చెన్నూర్ నియోజక వర్గ ఎంఎల్ఏ గా గెలవడంతో మంగళవారం భీమారం మండల జడ్పీటీసీ భూక్య తిరుమల, లక్ష్మణ్ వివేక్ అభిమానులు హనుమాన్ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వివేక్ వెంకట స్వామి ఎమ్మెల్యేగా గెలిస్తే మొక్కు చెల్లిస్తామని కోరుకున్నామని అన్నారు. కార్య క్రమంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు.పోడేటి రవి.కొమ్ము శ్రీనివాస్ ,వేల్పుల శ్రీనివాస్,కార్య కార్తలు పాల్గొన్నారు.