కోల్బెల్ట్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావాలని కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పూజలు చేశారు. గురువారం మందమర్రి మండలం తిమ్మాపూర్(బొక్కలగుట్ట రోడ్) శివారులోని జగదాంబేశ్వర ఆశ్రమంలోని జగదాంబేశ్వరుడి ఆలయంలో కాంగ్రెస్ లీడర్, అఖిల భారత యాదవ సంఘం జిల్లా ప్రెసిడెంట్ బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, యజ్ఞం, కుంకుమార్చన చేపట్టారు.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాకా కుటుంబం యాభై ఏండ్లుగా ప్రజలకు సేవలందిస్తోందన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రి పదవిలో ఉంటే ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తారని సదానందం పేర్కొన్నారు. అన్ని వర్గా లను ఆదుకుంటారని, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తారని అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం వివేక్వెంకటస్వామికి మంత్రి పదవి ప్రకటించాలని కోరారు.
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం
మందమర్రి పట్టణం పాత బస్టాండ్ఏరియాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త నీలం కొమురయ్య కుటుంబానికి గురువారం బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం చేశారు.
కొమురయ్య అనారోగ్యంతో ఇటీవల మృతిచెందగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు మృతుడి కుటుంబానికి రూ.10 వేలు అందజేసినట్లు సదానందం తెలిపారు. కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.