ఖమ్మం టౌన్, వెలుగు : అస్సాంలో ఏఐసీసీ నాయకులు రాహుల్‌గాంధీ పాదయాత్రను బీజేపీ నాయకులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ నాయకులు సోమవారం స్థానిక ధర్నా చౌక్ నుంచి జడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ తీశారు. రాహుల్ గాంధీ పై జరిగిన దాడిని, ప్రజాస్వామ్యంపైన జరిగిన దాడిగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షులు ఎండీ. జావీద్,మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు,మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు దోబ్బల సౌజన్య, పాల్గొన్నారు.
మధిర : మధిరలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ పాదయాత్రను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాదయాత్రను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంలో సూర్యాపేట -ఖమ్మం రహదారిపై కాంగ్రెస్ నాయకులు రాస్తారోఖో నిర్వహించారు. బీజేపి సృష్టిస్తున్న అడ్డుకుల్ని వెంటనే అపాలని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు ఎండీ హాఫీజుద్దీన్, బజ్జూరి వెంకటరెడ్డి, వాసు పాల్గొన్నారు.