సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు కాంగ్రెస్ లో గ్రూప్ వార్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు పాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. ఇవాళ అమీన్ పూర్ లో MLA గూడెం పర్యటన ఉంది. దీంతో ఆయన పర్యటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు పాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఎమ్మెల్యే.. ఇప్పుడు బీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు.
రెండు రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాల్లో మహిపాల్ రెడ్డి తీరు బాగో లేదని మండిపడ్డారు. ఆయన తీరుకు వ్యతిరేకంగా ముందుగా పటాన్ చెరు నేషనల్ హైవేపై బైఠాయించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్నా క్యాంప్ ఆఫీసులో కేసీఆర్ ఫోటోనే ఉందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ర ెడ్డి ఫోటో పెట్టడం ఇష్టం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లోనే ఉండాలని డిమాండ్ చేశారు.