కోల్బెల్ట్, వెలుగు : చెన్నూర్ఎమ్మెల్యే బాల్క సుమన్ గురువారం నామినేషన్ వేశాక.. కాంగ్రెస్ లీడర్లను బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. ‘అమ్ముడుపోయిన ఒక్కొక్కనా కొడుకుని బట్టలూడదీసి కొడ్తా.
ఒక్కొక్కడు ఎన్నెన్ని లక్షలకు అమ్ముడు పోయిన్రో బట్టలిప్పి బజారున నిలబెట్టుర్రి. డిసెంబర్ 30 తర్వాత నా చర్య మీరు చూస్తరు’ అంటూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన లీడర్లను బెదిరించారు.