గజ్వేల్: మాజీ సీఎం, గజ్వేల్ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు ఆఫీస్ను ఇవాళ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. ఈ మేరకు ఆఫీస్ లో కేసీఆర్ చిత్రపటానికి వినతి పత్రం అందించి నిరసనకు దిగారు. కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సక్రమంగా జరగడం లేదని విమర్శించారు. గెలిచిన నాటి నుంచి ఇప్పటికీ ఒక్కసారి కూడా గజ్వేల్‌కు రాలేదన్నారు. నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. క్యాంపు ఆఫీస్ గోడకు వినతి పత్రాన్ని అతికించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ విడిచి బయటకు రావాలని డిమాండ్ చేశారు.
ALSO READ | రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలె: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి