కక్ష సాధింపుతోనే కాంగ్రెస్‌ నేతలపై కేసులు : కాంగ్రెస్ నేతలు

కక్ష సాధింపుతోనే కాంగ్రెస్‌ నేతలపై కేసులు : కాంగ్రెస్ నేతలు

సూర్యాపేట, వెలుగు : కక్ష సాధింపుతోనే కాంగ్రెస్‌ అగ్రనేతలపై కేసులు పెడుతున్నారని, అక్రమ కేసులతో గాంధీ కుటుంబాన్ని భయపెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని జిల్లా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నేషనల్‌హెరాల్డ్‌ కేసు చార్జీషీటులో సోనియా, రాహుల్‌ పేర్లను చేర్చడంపై గురువారం జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ వద్ద కాంగ్రెస్​ నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.  కార్యక్రమంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కేసులను ఉపసంహరించుకోవాలి.

నల్గొండ అర్బన్, వెలుగు : మోదీ సర్కారు కాంగ్రెస్ అగ్రనేతలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ డిమాండ్​చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీపీ అగ్రనేతలు సోనియా, రాహుల్ పై ఈడీ అక్రమంగా చార్జ్ షీట్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ గురువారం నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్  మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.