కోల్‌బెల్ట్, వెలుగు: రామకృష్ణాపూర్ పట్టణంలోని కనకదుర్గా కాలనీకి చెందిన బర్ల లలితమ్మ బాధిత కుటుంబానికి కాంగ్రెస్ లీడర్లు సోమవారం ఆర్థికసాయం చేశారు. ఇటీవల లలితమ్మ కుమారుడు హర్షవర్ధన్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదేశాలతో క్యాతనపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పల్లె రాజు, రెండో వార్డు కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో స్థానిక లీడర్లు బాధిత కుటుంబం ఖర్చుల నిమిత్తం సాయమందించారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్‌గౌడ్, గోపు రాజం, బుడిగ శ్రీనివాస్, నల్లూరి రాజు, బొడ్డు వెంకటేశ్, రాజేశ్, కుర్మ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.