
హైదరాబాద్ సిటీ, వెలుగు: అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ జీతం నిలిపివేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. మంగళవారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ప్రతిపక్ష నేత హోదాలో ఉండి కూడా అసెంబ్లీకి రావడం లేదని, ఆయనకు జీతభత్యాలు నిలిపివేయాలని లెటర్లో పేర్కొన్నారు.
ఇన్ని రోజులపాటు ఇచ్చిన జీతాన్ని రికవరీ చేయాలని కోరారు. ప్రజల సొమ్మును కేసీఆర్ జీతంగా వాడుకుంటున్న నేపథ్యంలో వేతనాన్ని నిలిపివేయాలని జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, జగన్ నాయక్, భాస్కర్, సునీల్, సుధీర్, నర్సింహాగౌడ్ కోరారు.