- ఖనిలో ఇంటింటా ప్రచారం
యైటింక్లయిన్ కాలనీ, వెలుగు:పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని టౌన్ కాంగ్రెస్ లీడర్లు తెలిపారు. టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం బల్దియా పరిధిలోని 17,19వ డివిజన్లలో సోమవారం ఇంటింటా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టౌన్ అధ్యక్షుడు గుండేటి రాజేశ్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాకా కుటుంబం కృషి చేస్తోందన్నారు. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపించేందుకు ప్రతికార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. ప్రచారంలో లీడర్లు సాగంటి శంకర్, అనుమ రాములు, తిరుపతి రెడ్డి, కుమార్, రజిత, సురేందర్, సూరిలతో పాటు పార్టీ అనుబంధ సంఘాల లీడర్లుతదితరులు పాల్గొన్నారు.