నేడు ఈడీ ఆఫీసు ఎదుట కాంగ్రెస్ ధర్నా 

నేడు ఈడీ ఆఫీసు ఎదుట కాంగ్రెస్ ధర్నా 

హైదరాబాద్, వెలుగు : పీసీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరా బాద్​లోని ఎన్ఫోర్స్​మెంట్ డైరె క్టరేట్(ఈడీ) ఆఫీసు ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్ట నున్నారు. అదానీ కుంభకోణంపై జేపీసీ వేయాలని, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్లతో దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ హైకమాండ్ పిలుపునిచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్​పార్టీ నేతలు గురువారం

ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి బషీర్ బాగ్ లోని ఈడీ ఆఫీసు వరకు నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం అక్కడే ధర్నా చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొననున్నారు.