
గోదావరిఖని/మెట్‌పల్లి, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులకు నిరసనగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. గురువారం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో ఆ పార్టీ శ్రేణులు ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలు ధరించి బైఠాయించారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు ఎం.రవికుమార్, కార్పొరేషన్ ఏరియా అధ్యక్షుడు బొంతల రాజేశ్ మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడం దారుణమని మండిపడ్డారు.
కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్, లింగస్వామి, మల్లయ్య, బాలరాజు, ముస్తఫా, ఎల్లయ్య పాల్గొన్నారు. మెట్‌పల్లిలో కాంగ్రెస్ లీడర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం కొమిరెడ్డి రాములు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో లీడర్ ఎర్రోళ్ల హన్మాండ్లూ యాదవ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ సీబీఐ, ఈడీలను జేబు సంస్థగా మార్చుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో లీడర్లు జెట్టి లింగం, రాజయ్య, రైసోద్దిన్, మహేందర్ రెడ్డి, వంశీ పాల్గొన్నారు.