నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. జిల్లా కేంద్రంలో కళాభారతి ఆడిటోరియం శంకుస్థాపనకు వెళ్తున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్, ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వీరిని అడ్డుకొని స్టేషన్ కు తరలించారు.
కేటీఆర్ పర్యటన సందర్భంగా కోటగల్లిలో పీడీఎస్యూ నాయకుడు వి .ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ను పోలీసులు ముందస్తు హౌస్ అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులను ఇవాళ ఉదయం ముందస్తు అరెస్టు చేశారు. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న కళాభారతి ఆడిటోరియానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.