రైతులను మోసం చేస్తున్న సర్కారు : బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ,  వెలుగు :  వ్యవసాయానికి 24 గంటలు కరెంట్‌ ఇస్తామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం సాగర్ ఆయకట్టు పరిధిలో 3 గంటలే ఇస్తూ రైతులను మోసం చేస్తోందని మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఆదివారం కాంగ్రెస్ నేతలు మిర్యాలగూడ మండలంలోని అన్నారం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట  ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టదశకు వచ్చిన వరి ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సబ్‌ స్టేషన్‌ లాగ్‌బుక్‌ను పరిశీలిస్తే మూడు గంటలు సరఫరా అవుతున్నట్లు నమోదు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో  ఎంపీటీసీల ఫోరం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్,  యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సిద్దు నాయక్,  పవన్ నాయక్ పాల్గొన్నారు.