హైదరాబాద్, వెలుగు: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నలుగురు నేతలను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
సస్పెండ్‌కు గురైన వారిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సంజీవ రెడ్డి, ఆదిలాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ సాజిద్ ఖాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రాత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్ పాండే ఉన్నారు. వీరిని ఆరేండ్ల పాటు కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తున్నట్లు చిన్నారెడ్డి పేర్కొన్నారు.