కేంద్రం నుంచి నిధులు తెస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తాం : ముత్తిరెడ్డి

బచ్చన్నపేట, వెలుగు: బీజేపీ, కాంగ్రెస్​ నేతలకు దమ్ముంటే కేంద్రం నుంచి   నిధులు తేవాలని, వాటితో గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సవాల్​ చేశారు. మంగళవారం  జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేటలో రూ. 40 లక్షల ఈజీఎస్​  ఫండ్స్​తో  సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.  

బీజేపీ అధ్యక్షుడు కిషన్​రెడ్డి, కాంగ్రెస్​ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి  కేంద్రంతో కొట్లాడి రావల్సిన నిధులు తీసుకొస్తే తెలంగాణలలో పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, చెక్​డ్యామ్​ లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటామన్నారు.   అనంతరం పోచన్నపేట వాగు ను పరిశీలించారు. ఆయన వెంట  వైస్​ ఎంపీపీ కల్లూరి అనిల్​రెడ్డి,  సర్పంచ్​ గట్టు మంజుల, ఎంపీటీసీ సభ్యురాలు అరుణ, కొ ఆఫ్షన్​ సభ్యుడు షబ్బీర్​పాల్గొన్నారు.

ALSO READ :కాళేశ్వరం లెక్కలపై శ్వేతప్రతం విడుదల చేయాలి: ఎమ్మెల్యే రఘునందన్ రావు