
- భట్టి విక్రమార్కను కలిసిన
- మెదక్ కాంగ్రెస్ లీడర్లు
మెదక్, వెలుగు : మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డికే ఇవ్వాలని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కోరారు. గురువారం డీసీసీ అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పబ్బతి ప్రభాకర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహెందర్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సార శ్యాంసుందర్, మెదక్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గూడూరి ఆంజనేయులు గౌడ్, ఆయా మండల పార్టీ అధ్యక్షులు శంకర్, లక్కర్ శ్రీనివాస్, శామ్ రెడ్డి, లింగం గౌడ్, గోవింద్ నాయక్
యాదగిరి హైదరాబాద్ వెళ్లి గాంధీ భవన్లో భట్టి విక్రమార్కను కలిశారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేసిన తిరుపతి రెడ్డికే టికెట్ ఇవ్వడం సమంజసమన్నారు. పార్టీలో చేరకముందే మైనంపల్లి రోహిత్‌కు మెదక్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారైందన్న ప్రచారం పార్టీ క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, శ్రీకాంత్, సుఫీ పాల్గొన్నారు.