- కాంగ్రెస్ నాయకులు.
నర్సాపూర్, వెలుగు: ప్రొటోకాల్ పేరుతో బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తే ఊరుకోబోమని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ..జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి రాజి రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. సునీతా రెడ్డికి వారి గురించి మాట్లాడే అర్హత లేదు.
పదవుల కోసం పార్టీ మారే వ్యక్తులు కాదన్నారు. రాజిరెడ్డి ఓడినప్పటికీ నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ పార్టీ అధ్యక్షుడు రిజ్వాన్, పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మండల అధ్యక్షుడు మల్లేశ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, రషిద్, పీఏసీఎస్చైర్మన్ రాజు యాదవ్, మండల్ ఓబీసీ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్, అజ్మత్, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు శివ ప్రసాద్ గౌడ్, నరేశ్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్, సతీశ్ గౌడ్ పాల్గొన్నారు.