
కోల్‌బెల్ట్, వెలుగు: పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసి మొదటిసారి మంచిర్యాల జిల్లాకు చేరుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్శ్రేణులు, కాకా అభిమానులు ఘనస్వాగతం పలికారు. శనివారం సాయంత్రం జైపూర్మండలం ఇందారం చేరుకున్న ఆయనను చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, పార్టీ లీడర్లు, కార్యకర్తలు, అభిమానాలు ఘనంగా స్వాగతించారు. పూలమాలలు, శాలువాలు కప్పి ఆహ్వానించారు. డీజే సౌండ్స్, కళాకారుల డ్యాన్సుల మధ్య ఇందారం, నస్పూర్- ఆర్కే6 మైన్ఏరియా, రామకృష్ణాపూర్ఏరియా ఆస్పత్రి, రాజీవ్‌చౌక్, సూపర్‌బజార్ మీదుగా ఆర్కే1 మార్కెట్వరకు ర్యాలీ సాగింది.
ఇక్కడ ముస్లిం సంప్రదాయబద్దంగా ఎంపీ చేతికి దట్టి కట్టారు. కాళీనగర్వద్ద మందమర్రి లీడర్లు, కార్యకర్తలు స్వాగతం పలికారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ర్యాలీ మందమర్రి మార్కెట్, పాలచెట్టు, పాతబస్టాండు మీదుగా తిరిగి క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఎంఎన్ఆర్గార్డెన్స్కు చేరింది. పాత బస్టాండ్ వద్ద రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు ర్యాలీలో పాల్గొన్నారు. మందమర్రి మార్కెట్‌వద్ద డాక్టర్ బీఆర్అంబేద్కర్విగ్రహానికి ఎంపీ వంశీకృష్ణ పూలమాల వేసి నివాళి అర్పించారు.