పాదయాత్రగా వెళ్లి మొక్కులు తీర్చుకున్న కాంగ్రెస్ ​లీడర్లు

మధిర, వెలుగు : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు, మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయిన సందర్భంగా సోమవారం ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట కాంగ్రెస్  నాయకులు జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. పాదయాత్రను కాంగ్రెస్​ పార్టీ మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్​ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు.