గడ్డం వంశీకృష్ణ గెలుపు కోరుతూ ఆలయాల్లో పూజలు

కోల్​బెల్ట్/చెన్నూర్, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలుపొందుతారని కాంగ్రెస్ ​లీడర్లు ధీమా వ్యక్తం చేశారు. ఆలయాల్లో పూజలు చేశారు. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సోమవారం చెన్నూరులోని అంబా అగస్తేశ్వర ఆలయం నేత​ఐత హిమవంత్​రెడ్డి–శకుంతల దంపతులు, క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్​లోని ​రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో కాంగ్రెస్ టౌన్ ​ప్రెసిడెంట్ పల్లె రాజు, మందమర్రి అంగడి బజార్​లోని శివకేశవ సంజీవ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. 

అనంతరం లీడర్లు మాట్లాడుతూ.. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో కాకా కుటుంబం 60 ఏండ్లుగా ప్రజలకు సేవలు చేస్తోందన్నారు. వారి సేవలను గుర్తుంచుకొని వంశీకృష్ణని ప్రజలు ఓటు రూపంలో ఆశీర్వదించారని పేర్కొన్నారు. వంశీకి శివుడి అనుగ్రహం ఉంటుందని, భారీ మెజార్టీతో గెలుపొందుతున్నారని ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

 పూజల్లో మందమర్రి మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్, గోపు రాజం, పలిగిరి కనకరాజు, రామకృష్ణా, పూల్లూరి కల్యాణ్, రామకృష్ణ, చెన్నూరు కాంగ్రెస్ ​టౌన్​ ప్రెసిడెంట్​ చెన్న సూర్యనారాయణ, చింతల శ్రీనివాస్, బుర్ర కృష్ణ, జాడి రాజేందర్, రాంగోపాల్​రెడ్డి, రఘునందన్ ​రెడ్డి, సమ్మిరెడ్డి, మందమర్రి లీడర్లు రవికుమార్, గణేశ్, అడ్వకేట్​రంజిత్, తిరుపతి, రవీందర్​ తదితరులు పాల్గొన్నారు.