
కొహెడ, వెలుగు : గ్రూప్1 ఎగ్జామ్‌పై సీబీఐతో ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేస్తూ గురువారం కొహెడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. పరీక్షల రద్దుకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలన్నారు.
ALSO READ : రాష్ట్రంలో వైద్య విప్లవం .. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నం: హరీశ్ రావు
టీఎస్పీఎస్సీ చైర్మెన్ జనార్దన్‌రెడ్డితో సహా కమిటీ సభ్యులను తొలగించి కొత్త కమిటీ నియమించాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, నాయకులు వెంకటస్వామి, శంకర్, శ్రీనివాస్, అశోక్, రవి, సుధాకర్, కిషన్ ఉన్నారు.