రంగారెడ్డి జిల్లా నుంచే లోక్ సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. తుక్కుగూడలో జరిగే జనజాతర సభకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు. ‘‘కార్యకర్తలకు అండగా నిలబడేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు నడిచారు. పార్టీకి అండగా నిలబడి సోనియమ్మ నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
తుక్కుగూడ సభలోనే అసెంబ్లీ ఎన్నికలకు ఆరు గ్యారంటీలను ప్రకటించుకున్నాం. ఇప్పుడు ఏప్రిల్ 6 లేదా 7న అక్కడ జరిగే సభలోనే జాతీయస్థాయి గ్యారంటీలను ప్రకటించబోతున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ప్రభుత్వ వంద రోజుల పరిపాలనకు రెఫరెండంగా ఉంటుంది. తెలంగాణలో పార్టీని 14 స్థానాల్లో గెలిపించి సోనియమ్మకు కృతజ్ఞత చెబుదాం” అని పిలుపునిచ్చారు