పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. 48 పేజీలతో కూడిన మ్యానిఫెస్టోను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కలిసి విడుదల చేశారు. తమ మ్యానిఫెస్టోలో ముఖ్యంగా రైతులకు పెద్దపీట వేశామని ఖర్గే తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి అవసరమయ్యే విధంగా పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించి దానికి చట్ట భద్రత కల్పిస్తామని ఖర్గే హామీ ఇచ్చారు. .
దేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ రద్దు చేస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద రోజుకు రూ. 4 వందలు ఇస్తామని హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారెంటీలను పొందుపరిచారు.