తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్​ సభను సక్సెస్​ చేయాలి: మోహన్​ కుమార్​ మంగళం

మక్తల్, వెలుగు : ఈ నెల 17న తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్​  సభను సక్సెస్​ చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఏఐసీసీ అబ్జర్వర్​ మోహన్​ కుమార్​ మంగళం కోరారు. శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్​ పార్టీ ఆఫీస్​లో మీటింగ్​ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయభేరి సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలన్నారు. విజయభేరి సభ ద్వారా కాంగ్రెస్  పార్టీ ఎన్నికల శంఖారావం పూరిస్తుందని చెప్పారు. 

ALSO READ: పూర్తి కాని ప్రాజెక్టును ఎందుకు ప్రారంభిస్తున్రు? చంద్రశేఖర్

ఈ సభకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్  పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి రావాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి, పీసీసీ అధికార ప్రతినిధి నాగరాజ్ గౌడ్, ఎన్నారై కోర్  కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి, పీసీసీ సభ్యుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి, గవినోళ్ల బాలకృష్ణారెడ్డి, గోపాల్​రెడ్డి, కొత్తకోట సిద్ధార్థరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.