గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ మైనార్టీ నేతల ఆందోళన

గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ మైనార్టీ నేతల ఆందోళన

హైదరాబాద్, వెలుగు :  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో మైనారిటీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ.. సోమవారం నాంపల్లిలోని గాంధీ భవన్​ వద్ద కాంగ్రెస్​ మైనార్టీ నాయకులు ఆందోళన చేశారు.  మైనార్టీలకు ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు వారికి తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

 మైనార్టీల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు.. గాంధీ భవన్​ కు చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ భవిష్యత్​లో ఖాళీ కానున్న ఎమ్మెల్సీపై తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని మైనార్టీ నేతలు పట్టుబట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని  బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.